ఆదిలాబాద్‌ మార్కెట్ యార్డులో రేపటి నుంచి పత్తి కొనుగోలు

 కేంద్రంలోని మార్కెట్‌యార్డులో రేపటి నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్నామని కలెక్టర్ దివ్యరాజన్ అన్నారు. ఈ రోజు కలెక్టర్ మార్కెట్‌యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న పత్తిలో ఆమె తేమను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనాల్లో తెచ్చిన పత్తిలో తేమను యార్డులో, జిన్నింగ్‌లో పరిశీలిస్తామని అన్నారు. నిర్ణీత షెడ్యూలు మేరకే మండలాల వారీగా పత్తి కొనుగోళ్లు జరుగుతాయని ఆమె తెలిపారు. 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీసీఐ కొనుగోలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. పత్తిలో 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే వ్యాపారులు కొనుగోలు చేస్తారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తికి ఎక్కువ మద్దతు ధర లభించేలా చూస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.